About Us

పూర్వకాలము నుండియు చోడవరం కోట ఎంతో ప్రసిద్ధి గాంచింది. విజయనగర సామ్రాజ్యములో అంతర్భాగమైన చోడవరం కోటకు సంస్థానానికి సర్వసైన్యదికరైన ' పకీర్ సాహెబ్' అనే మహమ్మదీయుని, విజయనగరం గజపతిరాజు నియమించారు. వారి పేరిట ఈ పాత్ర పాలనా భాద్యతలు పకేర్ సాహెబ్ నిర్వహించేవారు. అందుకే ఈ గ్రామానికి కల క్రమేణా పకేర్ సాహెబ్ పేట (పి. ఎస్. పేట) గా నామకరణం జరిగినది. విశాఖ జిల్లా చోడవరం పట్టణానికి 2 కి మీ దూరంలో ఈ గ్రామము కలదు ఈ ఉరిలో శుద్ద షోత్రియులైన భ్రాహ్మనొత్తములు , శ్రీ సరిపల్లి నారాయుడు గారు, శ్రీ వడ్డాది సూర్యనారాయణ గారు, శ్రీ దేవగుప్తపు వెంకన్న పంతులుగారు , శ్రీ సరిపల్లి అప్పన్న దేక్షితులు మున్నగువారు గ్రామ పెద్దలుగా వ్యవహరించేవారు వీరు ధర్మపరులు, సత్గునవంతులు , విధ్యసంపన్నులుగా గ్రామ ప్రజలచే గౌరవింప బడేవారు

Read More